ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 3:45 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

డి.ఏ.పీ. ఎరువుల అక్రమ విక్రయాలపై కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకురాలు డా. బోగ శ్రావణి

డి.ఏ.పీ. ఎరువుల అక్రమ విక్రయాలపై కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకురాలు డా. బోగ శ్రావణి

జగిత్యాల ప్రతినిధి ::
అర్జున్ సమాచారం జులై 27::

జగిత్యాల జిల్లాలో రైతులకు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు డి.ఏ.పీ. ఎరువులు విక్రయిస్తున్న డీలర్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నాయకురాలు డా. బోగ శ్రావణి జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా డా. బోగ శ్రావణి మాట్లాడుతూ, డి.ఏ.పీ. ఎరువుల ఎమ్మార్పీ ధర ₹1,350 మాత్రమే ఉన్నప్పటికీ, కొంతమంది డీలర్లు ఒక్కో బస్తాను ₹1,950 వరకు విక్రయిస్తూ రైతుల నుండి అదనంగా ₹600 వసూలు చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయ సీజన్‌లో ఎరువులపై రైతులకు ఉన్న అత్యవసర అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు పాల్పడటం అత్యంత దురదృష్టకరమని అన్నారు.

అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి కారణంగా రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ ధరలకే ఎరువులు రైతులకు అందేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

అలాగే, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు డి.ఏ.పీ. ఎరువులు విక్రయిస్తున్న డీలర్లు, షాపు యజమానులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. రైతుల ప్రయోజనాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ వారి పక్షాన నిలుస్తుందని డా. బోగ శ్రావణి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బద్దం తిరుపతి రెడ్డి,జిల్లా కార్యదర్శిలు ముత్యం రెడ్డి,పాత రమేష్,జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత,జిల్లా యువ మోర్చా అధ్యక్షురాలు ఇత్తడి శేఖర్,SC మోర్చా జిల్లా అధ్యక్షులు నారపక అశోక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, మరియు జిల్లా, మండల పదాధికారులు ముఖ్యనాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.